ఘనంగా కుంచావారి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:45 AM
స్థానిక మెయిన్‌రోడ్డులోని చిననాలుగురోడ్ల జంక్షన్ వద్ద గల కుంచావారి గౌరీపరమేశ్వరుల ఉత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున గౌరీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
అనకాపల్లి టౌన్, డిసెంబరు 23: స్థానిక మెయిన్‌రోడ్డులోని చిననాలుగురోడ్ల జంక్షన్ వద్ద గల కుంచావారి గౌరీపరమేశ్వరుల ఉత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున గౌరీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. గౌరీ పరమేశ్వరులను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్, కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్, మందపాటి జానకిరామరాజు, తదితరులు దర్శించుకున్నారు. వారిని ఉత్సవ కమిటీ చైర్మన్ ఎం.వీరభద్రరావు సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. మధ్యాహ్నం గౌరీ పరమేశ్వరులను నూతనంగా ఏర్పాటు చేసిన రథంలో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవం సందర్భంగా భక్తులతో చిననాలుగురోడ్ల జంక్షన్, పెరుగుబజార్, మెయిన్‌రోడ్డు కిటకిటలాడాయి. ఈ కార్యక్రమాల్లో కమిటీ గౌరవాధ్యక్షుడు పాండ్రంగి సత్యారావు, కోరుకొండ సాంబశివరావు, కుంచా దివాకర్, కుంచా సందీప్, కుంచావారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.