ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య
ABN , First Publish Date - 2023-09-16T01:04:07+05:30 IST
భారత సాంకేతిక రంగానికి పునాదులు వేసిన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆయన్ను ఇంజనీర్లు, యువత ఆదర్శంగా తీసుకోవాలని విశాఖపట్నం నేవీ చీఫ్ ఇంజనీర్ దినేష్ అగర్వాల్ అన్నారు.
సిరిపురం, సెప్టెంబరు 15 : భారత సాంకేతిక రంగానికి పునాదులు వేసిన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆయన్ను ఇంజనీర్లు, యువత ఆదర్శంగా తీసుకోవాలని విశాఖపట్నం నేవీ చీఫ్ ఇంజనీర్ దినేష్ అగర్వాల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం సిరిపురం బిల్డర్స్ అసోసియేషన్ హాల్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదులపై అనేక ఆనకట్టలు, వంతెనలు కట్టిన మహోన్నత వ్యక్తి విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. అనంతరం సైట్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీఏఐ విశాఖపట్నం చైర్మన్ కె. వెంకటేశ్వర్లు, జాతీయ ఉపాధ్యక్షుడు సీహెచ్ రామకోటయ్య, జీసీ సభ్యులు డా.కె. కుమార్‌రాజా, కోశాధికారి జి. సుబ్బారావు, ఆర్. సత్యనారాయణ, జీవీ రవిరాజు, పాల్గొన్నారు.