నిరుద్యోగులను మోసగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2023-04-03T00:46:18+05:30 IST

ఎన్నికల సమయంలో యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిసామని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టోపీ పెట్టాయని ఏఐవైఎఫ్‌ జిల్లా కో-కన్వీనర్‌ ఎన్‌.మధురెడ్డి దుయ్యబట్టారు.

నిరుద్యోగులను మోసగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
సమావేశంలో మాట్లాడుతున్న మధురెడ్డి

ఏఐవైఎఫ్‌ జిల్లా కో-కన్వీనర్‌ ఎన్‌.మధురెడ్డి

వెంకోజీపాలెం, ఏప్రిల్‌ 2: ఎన్నికల సమయంలో యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిసామని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టోపీ పెట్టాయని ఏఐవైఎఫ్‌ జిల్లా కో-కన్వీనర్‌ ఎన్‌.మధురెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఏఐవైఎఫ్‌ యూత్‌ సర్వసభ్య సమావేశం కృష్ణా కళాశాల సమీపంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మధురెడ్డి మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని, ప్రతీ పేదవాడి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని హామీలిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక వాటికి తుంగలో తొక్కారన్నారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా వున్న రెండు లక్షల పోస్టులను భర్తీ చేయకుండా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు కల్పించి చేతులు దులుపుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి రానున్న రోజుల్లో యువత తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన యువత ఉద్యోగాలు రాక మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు కెల్లా రమణ, బన్నీ, తేజ, నిశాంత్‌, వినయ్‌కిరణ్‌, వైకుంఠ, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:46:18+05:30 IST