నేటి నుంచి పది పరీక్షలు
ABN , First Publish Date - 2023-04-03T00:18:59+05:30 IST
జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.
ఉదయం 9.30 నుంచి మఽధ్యాహ్నం 12.45 వరకు నిర్వహణ
జిల్లాలో 136 కేంద్రాలు ఏర్పాటు
హాజరుకానున్న 29,286 మంది విద్యార్థులు
పరీక్షలు జరిగే పాఠశాలల్లో ఇతర తరగతులకు సెలవు
విద్యార్థులకు కలెక్టర్, డీఈవో శుభాకాంక్షలు
విశాఖపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 18 వరకు జరగను న్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు 136 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 29,286 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 27,547 మంది రెగ్యులర్, 1,739 మంది ప్రైవే టు విద్యార్థులున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 14,255 మంది బాలురు, 13,292 మంది బాలికలున్నారు.
నగరంలో 105, గ్రామీణ ప్రాంతంలో 31 కేంద్రాలు ఏర్పాటుచేయగా వాటిలో ఒకేషన్ కోర్సులకు 11 కేంద్రాలు కేటాయించారు. పరీక్షలకు 1500 మంది ఇన్విజిలేటర్లు అవసరం కాగా, జిల్లాలో అంతమంది టీచర్లు లేకపోవడంతో అనకాపల్లి జిల్లా నుంచి 300 మందిని నియమించారు. పరీక్షలు జరిగే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అక్కడి టీచర్లకు ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించారు.
ఉదయం 8.30 నుంచే అనుమతి
పరీక్షలు రాసే విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. పరీక్షలు ప్రారంభమైన అరగంట వరకు అనుమతిస్తారు. ప్రతి రోజు ఒకే విద్యార్థి/విద్యార్థులు ఆలస్యంగా వస్తే అనుమతించవద్దని ఆదేశాలిచ్చారు. పరీక్షలు నిర్వహించే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం తో ప్రైవేటు పాఠశాలలు మధ్యాహ్నం పాఠశాలలు నడిపితే చర్యలు తీసుకుంటామని డీఈవో చంద్రకళ హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాలులోని కి ఎలకా్ట్రనిక్ పరికరాలు, స్మార్ట్ వాచీలతో రాకూడద న్నారు. పదోతరగతి పరీక్షలకు ప్రత్యేక పరిశీలకులుగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతికుమారిని నియమిం చారు. ఈ మేరకు ఆదివారం ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో చంద్రకళ క్వీన్‌మేరీస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్ నుంచి సమీక్షించారు. సోమవారం స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాల పంపిణీలో ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆల్‌ది బెస్ట్: కలెక్టర్
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కలెక్టర్ డాక్టరు ఎ.మల్లికార్జున శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని, ప్రతి విద్యార్థి ఉదయం 8.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా రాయాలని కోరారు. ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో చంద్రకళ కూడా విద్యార్థులకు శభాకాంక్షలు తెలిపారు.
అసలైన పరీక్ష ‘సైన్స్’
విద్యార్థులు అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందే
రెండు సబ్జెక్టులకు ఒకటే ప్రశ్నపత్రం
జవాబులు రాసేందుకు వేర్వేరు బుక్‌లెట్లు
విశాఖపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
పదోతరగతి విద్యార్థులకు సైన్స్ పేపరు అసలైన పరీక్షగా మారనున్నది. ఫిజికల్‌సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. జవాబులు మాత్రం వేర్వేరు బుక్‌లెట్‌లలో రాయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు అవగాహన కోసం ప్రీఫైనల్‌లో ప్రాక్టీస్ చేయించినా, చాలా పాఠశాలల్లో ఫిజిక్స్ ఆన్సర్ బుక్‌లెట్‌లో బయోలాజికల్ సైన్స్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులు రాశారు. ఈ పరిస్థితి పబ్లిక్ పరీక్షలలో పునరావృతమైతే విద్యార్థులు నష్టపోతారని సబ్జెక్టు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐదు సబ్జెక్టులు 100 మార్కులకు, సైన్స్‌కు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఒకటే పరీక్ష నిర్వహిం చనున్నారు. సైన్స్ రెండు పేపర్లకు కలిపి ఒకటే ప్రశ్నపత్రం ఇస్తారు. ఇందులో ఒకటి నుంచి 16వ ప్రశ్న వరకు ఫిజికల్ సైన్స్, 17 నుంచి 33వ ప్రశ్న వరకు బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుకు చెందిన ప్రశ్నలుంటాయి. కాగా జవాబులు రాసేందుకు 12 పేజీల చొప్పున రెండు బుక్‌లెట్లు ఒకేసారి విద్యార్థులకు ఇస్తారు. వీటిలో వేర్వేరుగా జవాబులు రాయాలి. అయితే సాధారణంగా పరీక్షలలో విద్యార్థులకు బాగా వచ్చే ప్రశ్నలకు ముందుగా జవాబులు రాసే అలవాటు ఉంటుంది. ఈ ఒత్తిడిలో ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు చెందిన జవాబులు బయోలాజికల్ సైన్స్ బుక్‌లెట్‌లో రాస్తే మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. దీనికితోడు ప్రశ్నపత్రంలో పేర్కొన్నట్టుగా ఒకటి నుంచి 16 వరకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు ప్రశ్నలకు సంబంధించి జవాబులు రాసేటప్పుడు తప్పకుండా ప్రశ్న నంబరు వేయాలి. ఒకవేళ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు చెందిన ప్రశ్ననంబరుతో బయోలాజికల్ సైన్స్ బుక్‌లెట్‌లో రాసినా పరిగణనలోనికి తీసుకోరు. ఈ నేపథ్యంలో సైన్స్ పరీక్ష రాసే సమయంలో విద్యార్థులను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అప్రమత్తం చేయాలని ఇన్విజిలేటర్లకు విద్యాశాఖ సూచించింది. ఈ విషయాన్ని పరీక్షహాలులో బోర్డుపై సూచనగా రాయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సైన్స్‌పేపరు నిర్వహణ తీరును సబ్జెక్టు టీచర్లు తప్పుబడుతున్నారు. గత ఏడాది మాదిరిగా వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే మేలని, లేదా ఒక ప్రశ్నపత్రం మాదిరిగానే ఒకటే బుక్‌లెట్ ఇచ్చినా ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు. జవాబుపత్రాలను బండిల్‌గా ప్యాక్ చేసే సమయంలో ఇన్విజిలేటర్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని సీనియర్ టీచరు ఒకరు అభిప్రాయపడ్డారు.