తెలుగు భాషను ఉన్నత స్థాయికి తేవాలి

ABN , First Publish Date - 2023-01-29T01:07:38+05:30 IST

తెలుగు భాష గొప్పతనం భావితరాలకు తెలిసేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలుగు భాషా పరిరక్షణ సమితి కన్వీనర్‌ కె. రామ్మోహన్‌రావు కోరారు.

తెలుగు భాషను ఉన్నత స్థాయికి తేవాలి
విజేతలతో తెలుగు భాషా పరిరక్షణ సమితి సభ్యులు

చోడవరం, జనవరి 28: తెలుగు భాష గొప్పతనం భావితరాలకు తెలిసేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలుగు భాషా పరిరక్షణ సమితి కన్వీనర్‌ కె. రామ్మోహన్‌రావు కోరారు. శనివారం స్థానిక ఉషోదయ విద్యా సంస్థలు, లక్ష్మీపురం, లక్కవరం హైస్కూళ్లలో తెలుగు భాష పరిరక్షణ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే విద్యార్థులకు తెలుగులో వక్తృత్వ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం హైస్కూల్‌ హెచ్‌ఎం వీవీ శేషగిరిరావు, ఎస్‌వీ.వాసు, తమ్మిరాజు, వి.రమేష్‌, జి రామిరెడ్డి, రేవతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T01:07:39+05:30 IST