టీడీపీ అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తాం

ABN , First Publish Date - 2023-05-02T01:01:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాయల మురళీ, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి హామీ ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తాం
ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు

కశింకోట, మే 1 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాయల మురళీ, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి హామీ ఇచ్చారు. మండలంలోని కొత్తపల్లిలో సోమవారం ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిస్తే జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులమయం అయ్యిందని ఆరోపించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనకాపల్లి నియోజకవర్గంలోని 6 వేల మంది పింఛన్లను తొలగించారని ఆరోపించారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి వైసీపీ నిరంకుశ పాలనపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుదిరెడ్డి అప్పడు, బుదిరెడ్డి గంగయ్య, రెడ్డి రామారావు, గోవింద, సూరిబాబు, కలగా సోమేశ్వరరావు, సిద్దిరెడ్డి సూర్యనారాయణ, నైనంశెట్టి రమణారావు, ద్వారపురెడ్డి సత్తిబాబు రమేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T01:01:23+05:30 IST