టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యం కావాలి
ABN , First Publish Date - 2023-02-07T01:12:09+05:30 IST
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడి వలే పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు.

అనకాపల్లి అర్బన్, ఫిబ్రవరి 6 : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడి వలే పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడి కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని పార్టీ శ్రేణులకు పరిచయం చేసి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున అంతా విస్తృత ప్రచారం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ గెలుపు వచ్చే ఎన్నికలకు నాంది కావాలన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వైసీపీ నాయకులు నిలుపుదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. విశాఖ నగరంలో ఉన్న అనేక ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి కలగదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.