వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

ABN , First Publish Date - 2023-02-07T01:03:46+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అఽధోగతి పాలైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

సబ్బవరం, ఫిబ్రవరి 6 : వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అఽధోగతి పాలైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. మండలంలోని ఆయ్యన్నపాలెం శివారు బుదిరెడ్లపాలెంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా సోమవారం విస్తృతంగా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులతో పాటు అన్నింటి ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతికి బట్టకట్టలేని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బుదిరెడ్ల శ్రీలక్ష్మి, ఉప సర్పంచ్‌ బుదిరెడ్ల కనకరాజు, నాయకులు మిడతాడ మహాలక్ష్మినాయుడు, తమరాన బంగారునాయుడు, ఎల్లాజీ, నర్సింగరావు, రేసుపూడి రమణ, ఆకుల గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:03:47+05:30 IST