టీడీపీ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2023-05-26T01:05:16+05:30 IST

ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

టీడీపీ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
మాజీ ఎమ్మెల్యే వి.అనితకు కంటి పరీక్ష చేస్తున్న డాక్టర్‌ ప్రసాద్‌

పాయకరావుపేట, మే 25: ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక కల్యాణ మండపంలో హైమా కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్‌ పీఎస్‌ఆర్‌.ప్రసాద్‌, డాక్టర్‌ సుధీర్‌ నిర్వహించిన వైద్య శిబిరాన్ని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రారంభించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి శ్రీను నేతృత్వంలో నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరవంలో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 60 మందికి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించామని వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-05-26T01:05:33+05:30 IST