స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్)గా సురేష్‌కుమార్ పాండే
ABN , First Publish Date - 2023-02-08T00:49:04+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్)గా సెయిల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వరిస్తున్న సురేశ్‌కుమార్ పాండే నియమితులయ్యారు.
ఉక్కుటౌన్‌షిప్, ఫిబ్రవరి 7: విశాఖ స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్)గా సెయిల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వరిస్తున్న సురేశ్‌కుమార్ పాండే నియమితులయ్యారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన కేసీ దాస్ గత ఏడాది పదవీ విరమణ చేయడంతో ఇప్పటివరకు ఇన్‌చార్జిగా మరో డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పబ్లిక్ ఎంటర్‌ప్రెజెస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపికలు నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ నుంచి డైరెక్టర్ పోస్టుకు ఆరుగురు, సెయిల్ నుంచి ఇద్దరు, ఇంజనీర్స్ ఇండియా నుంచి ఒకరు హాజరవ్వగా.. సెయిల్ సీజీఎం సురేశ్‌కుమార్ పాండేను ఎంపిక చేసినట్టు పీఈఎస్‌బీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.