గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీపై రుణాలివ్వాలి
ABN , First Publish Date - 2023-08-02T00:43:26+05:30 IST
రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్రకుమార్‌ను మంగళవారం కోరినట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్ తెలిపారు.
అనకాపల్లి టౌన్, ఆగస్టు1 : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్రకుమార్‌ను మంగళవారం కోరినట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్ తెలిపారు. ప్రతి పెంపకందారునికి 54 శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు చొప్పున రుణం ఇవ్వాలని కోరామన్నారు. ఎన్‌సీడీసీ రూ. 88 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేసి ఆరు నెలలు కావస్తున్నా వాటిని విడుదల చేయలేదన్నారు. గొర్రెలు, మేకల రక్షణకు 90 శాతం సబ్సిడీతో ఉపాధి హామీ నిధులతో షెడ్లు నిర్మించాలని కోరామన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో సంఘ ప్రతినిధులు పీవీ ఆంజనేయులు, కిలారి పెదబ్బాయి, పి. తిరుపతిరావు ఉన్నారు.