విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2023-01-29T00:54:48+05:30 IST

: విద్యార్థులు దేశం పట్ల అత్యంత ప్రేమ భావం, బాధ్యతను కలిగి ఉండాలని విశ్రాంత వైస్‌ అడ్మిరల్‌ రమణ్‌ పూరీ పేర్కొన్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవాలి
విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న రమణ్‌ పూరీ

రిటైర్డ్‌ వైస్‌ అడ్మిరల్‌ రమణ్‌ పూరీ

కంచరపాలెం, జనవరి 28 : విద్యార్థులు దేశం పట్ల అత్యంత ప్రేమ భావం, బాధ్యతను కలిగి ఉండాలని విశ్రాంత వైస్‌ అడ్మిరల్‌ రమణ్‌ పూరీ పేర్కొన్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రమణ్‌ పూరీ మాట్లాడుతు ప్రపంచ దేశాలలో భారతీయులు అత్యంత మేథోశక్తిని కలిగినవారని, తమ శక్తియందు విశ్వాసం కలిగి ఉండాలని ఉద్భోదించారు మేథస్సు కలిగిన విద్యార్థులంతా విదేశాలకు వలస వెళ్లడం వలన భారతదేశానికి తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడటం వలన జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీవీ సత్యనారాయణ మూర్తి, సిబ్బంది రమణ్‌ పూరీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T00:54:50+05:30 IST