Share News

సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:11 AM

అంగన్‌వాడీల సమస్యలను పరిష్క రించే వరకూ సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ భీమిలి జోన్‌ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు.

సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె

భీమునిపట్నం, డిసెంబరు 23 : అంగన్‌వాడీల సమస్యలను పరిష్క రించే వరకూ సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ భీమిలి జోన్‌ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో భీమిలి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీలు రిలే దీక్ష చేప ట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్‌ అంగన్‌వాడీల హామీల అమలులో మొండిగా వ్యవహరించడం తగదన్నారు. 12 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వ నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొవ్వాడ లక్ష్మి, పాలవలస పద్మ, వెంకటలక్ష్మి, శ్రీదేవి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ అనురాధ, ఆర్‌.నరసింగరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:11 AM