సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:48 PM
ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఆ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్ ఆనందరావు, నాతవరం తహసీల్దార్ వాసు, ఐసీడీఎస్ సీడీపీవో శ్రీకళ అంగన్‌వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపారు.
గొలుగొండ, డిసెంబరు 17 : ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఆ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్ ఆనందరావు, నాతవరం తహసీల్దార్ వాసు, ఐసీడీఎస్ సీడీపీవో శ్రీకళ అంగన్‌వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి తహసీల్దార్ ఆనందరావు మా ట్లాడుతూ ప్రభుత్వం ఐదు సమస్యలు పరిష్కరించేం దుకు అంగీకరించిందని చెప్పారు. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడానికి, రిటైర్‌మెంట్ సమయంలో ఇచ్చే నగదు యాబై వేల నుంచి లక్ష రూపాయలకు, ఆయాలకు ఇరవై వేల నుంచి నలబై వేలకు పెంచడానికి, మినీ సెంటర్లు అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఆమోదించిందన్నారు. అలాగే టీఏ డీఏల మంజూరుకు కూడా ఆమోదం తెలిపిందని, సమ్మె విరమించాలని కోరారు. దీనిపై అంగన్‌వాడీ కార్యకర్త్తలు స్పందిస్తూ ప్రభుత్వానికి అందించిన వినతిపత్రంలో తెలిపిన డిమాండ్లన్నీ అమలు చేసేవరకూ సమ్మె విరమించమని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికా రులు తెలిపారు.ఈ సమావేశంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు భ్రమరాంబ, మంగతాయారు. సత్య, రాయపురెడ్డి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.