మాదక ద్రవ్యాల రవాణాపై గట్టి నిఘా అవసరం

ABN , First Publish Date - 2023-04-03T23:50:57+05:30 IST

మాదక ద్రవ్యాలు సాగు చేయడం, రవాణా, అమ్మకాలపై మరింత గట్టి నిఘా ఉండాలని అధికారులను కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు.

మాదక ద్రవ్యాల రవాణాపై గట్టి నిఘా అవసరం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, చిత్రంలో ఎస్పీ గౌతమి శాలి

జిల్లా కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి

అనకాపల్లి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు సాగు చేయడం, రవాణా, అమ్మకాలపై మరింత గట్టి నిఘా ఉండాలని అధికారులను కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. మాదక ద్రవ్యాల నిరోధక శాఖ రూపొందించిన జాయింట్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలుపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి పోలీసు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు నెలవారీ యాక్షన్‌ ప్లాన్‌ అవసరమన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకాన్ని పూర్తిగా నిరోధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గంజాయి సాగు, రవాణా నియంత్రణకు పటిష్ట ప్రణాళిక అవసరమన్నారు. విద్యాసంస్థల గోడలపై టోల్‌ ఫ్రీ నంబరు 14500ను ప్రదర్శించాలన్నారు. దీని కోసం స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణా అరికట్టేందుకు చేపడుతున్న ప్రణాళికలను వివరించారు. నర్సీపట్నం, గొలిగొండ, కేడీ పేట మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో అనకాపల్లి ఆర్డీవోలు చిన్నికృష్ణ, జయరాం, డీఎంహెచ్‌వో హేమంత్‌, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, అదనపు ఎస్పీ (క్రైం) సత్యనారాయణరావు, డీఎస్పీలు మళ్ల మహేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, కె.ప్రవీణ్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:50:57+05:30 IST