22న స్టాండింగ్‌ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2023-09-20T01:10:11+05:30 IST

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఈనెల 22న నిర్వహించనున్నట్టు కార్యదర్శి పి.నల్లనయ్య మంగళవారం తెలిపారు.

22న స్టాండింగ్‌ కమిటీ సమావేశం

20 అంశాలతో అజెండా

విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఈనెల 22న నిర్వహించనున్నట్టు కార్యదర్శి పి.నల్లనయ్య మంగళవారం తెలిపారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి 20 అంశాలతో అజెండా తయారుచేసి సభ్యులకు అందజేశామన్నారు. నగరంలోని పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులతోపాటు దుకాణాల వేలం, యూజీడీ విభాగానికి సంబంధించి రూ.61.85 లక్షలతో వివిధ యంత్రాలు కొనుగోలుకు సంబంధించిన అంశాలను అజెండాలో పొందుపరిచారు.

Updated Date - 2023-09-20T01:10:11+05:30 IST