Share News

మొలకలొచ్చిన వరి పైరు

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:40 AM

తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి సర్పా, వరహా నదుల్లో వరద పొటెత్తడంతో నదులకు ఇరువైపులా వున్న పలు గ్రామాల్లో వరి పంటకు తీవ్రంగా దెబ్బతిన్నది. కోత కోసి కుప్ప వేయని పొలాల్లో వరి పనలు నీటిలో కొట్టుకుపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో వరిపైరు పూర్తిగా నీట మునిగింది. సుమారు వెయ్యి ఎకరా ల్లో వరి పంట దెబ్బతినగా, ఇందులో 530 ఎకరాల్లో పూర్తిగా పాడైపోయింది. వరి దుబ్బులు కుళ్లిపోయి, కంకులు మొలకెత్తాయి. ముఖ్యంగా నదుల పక్కన వున్న చౌడువాడ, కైలాసపట్నం, కోటవురట్ల, రాజుపేట గ్రామాల్లో వరిపొలాల్లో ఇప్పటికీ నీరు తగ్గలేదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, కోతకు వచ్చిన పంట తుఫాన్‌ పాలైందని అన్నదాతలు వాపోతు న్నారు నీటిలో కుళ్లిపోయి, మొలకెత్తిన కంకులను చూసి కన్నీటి పర్వంతం అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటల బీమా పథకం కింద పూర్తి పరిహారం వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

మొలకలొచ్చిన వరి పైరు
కోటవురట్లలో వరద ముంచెత్తిన వరి పొలంలో మొలకలు వచ్చిన కంకులు

వారం రోజులుగా నీటిలోనే పంట

కోటవురట్ల మండలంలో వెయ్యి ఎకరాల్లో దెబ్బతిన్న వరి

530 ఎకరాల్లో పూర్తిగా నష్టం

కోటవురట్ల, డిసెంబరు 13:

తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి సర్పా, వరహా నదుల్లో వరద పొటెత్తడంతో నదులకు ఇరువైపులా వున్న పలు గ్రామాల్లో వరి పంటకు తీవ్రంగా దెబ్బతిన్నది. కోత కోసి కుప్ప వేయని పొలాల్లో వరి పనలు నీటిలో కొట్టుకుపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో వరిపైరు పూర్తిగా నీట మునిగింది. సుమారు వెయ్యి ఎకరా ల్లో వరి పంట దెబ్బతినగా, ఇందులో 530 ఎకరాల్లో పూర్తిగా పాడైపోయింది. వరి దుబ్బులు కుళ్లిపోయి, కంకులు మొలకెత్తాయి. ముఖ్యంగా నదుల పక్కన వున్న చౌడువాడ, కైలాసపట్నం, కోటవురట్ల, రాజుపేట గ్రామాల్లో వరిపొలాల్లో ఇప్పటికీ నీరు తగ్గలేదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, కోతకు వచ్చిన పంట తుఫాన్‌ పాలైందని అన్నదాతలు వాపోతు న్నారు నీటిలో కుళ్లిపోయి, మొలకెత్తిన కంకులను చూసి కన్నీటి పర్వంతం అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటల బీమా పథకం కింద పూర్తి పరిహారం వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

నాలుగు ఎకరాల్లో పంట పోయింది

శానాపతి పైడియ్యనాయుడు, చౌడువాడ, కోటవురట్ల

నాలుగు ఎకరాల్లో వరి సాగు చేపట్టాను. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి అయ్యింది. పంట ఆశాజనకంగా పండింది. కోత పనులకు సిద్ధం అవుతుండగా తుఫాన్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈదురు గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురవడంతో పైరు మొత్తం నేలవాలి నీటిలో మునిగిపోయింది. వారం రోజులు పాటు నీటిలో వుండడంతో వరి దుబ్బులు కుళ్లిపోయి, ధాన్యం కంకులు మొలకెత్తాయి. గడ్డి, ధాన్యం ఎందుకూ పనికిరాకుండా పోయాయి. లక్ష రూపాయల పెట్టుబడి తుఫాన్‌ పాలైంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.

Updated Date - Dec 14 , 2023 | 01:40 AM