ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-09-04T00:19:38+05:30 IST

పాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు డివిజన్‌ స్థాయిలో క్రీడా పోటీలు ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి.

ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ప్రారంభం
క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్‌

నర్సీపట్నం, సెప్టెంబరు 3 : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు డివిజన్‌ స్థాయిలో క్రీడా పోటీలు ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో తొలుత క్రికెట్‌ పోటీలను పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్‌ ప్రారంభించారు. ఈ పోటీలలో నర్సీపట్నం డివిజన్‌ నుంచి ఏడు జట్లు పాల్గొన్నాయి. సాయంత్రం పెదబొడ్డేపల్లి ఆర్‌సీఎం స్కూల్‌ ఆవరణలోని ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ పోటీలు నిర్వహించారు. సోమవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం రెండు గంటలకు ఉపాధ్యాయినులకు మ్యూజికల్‌ చైర్‌, షటిల్‌, టెన్నీకాయిట్‌ పోటీలు నిర్వహిస్తారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్టు డీజీ నాథ్‌ తెలిపారు.

Updated Date - 2023-09-04T00:19:38+05:30 IST