క్రీడాకారులకు సత్కారం

ABN , First Publish Date - 2023-03-26T00:10:22+05:30 IST

జిల్లా క్రీడా సాధికార సంస్థ ఈనెల ఎనిమిదవ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన మహిళా దినోత్సవాలు శనివారంతో ముగిశాయి.

క్రీడాకారులకు సత్కారం
క్రీడాకారిణిని సత్కరిస్తున్న దృశ్యం

అనకాపల్లి టౌన్‌, మార్చి 25: జిల్లా క్రీడా సాధికార సంస్థ ఈనెల ఎనిమిదవ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన మహిళా దినోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో క్రీడాకారులు డి. కుసుమ, ఆర్‌.పూర్ణలను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు పి.నిర్మల, దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ కె.సావిత్రి సత్కరించారు. అలాగే క్రీడాభివృద్ధికి సేవలందించిన వ్యాయామ ఉపాధ్యాయులు జి.సుజాత, పి.కమల, కె.నారాయణమ్మ, జి.దేవిలను ముఖ్యఅతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా సాధికార సంస్థ అధికారి ఎన్‌.సూర్యారావు, ఎన్‌వైకే అధికారి మహేష్‌, సెట్విస్‌ మేనేజర్‌ బి.నూకరాజు, మహేష్‌, కేఎన్‌వీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:10:22+05:30 IST