హైదరాబాద్‌–కటక్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2023-05-30T03:51:47+05:30 IST

ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

హైదరాబాద్‌–కటక్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. 07165 నంబర్‌ రైలు (హైదరాబాద్‌–కటక్‌–హైదరాబాద్‌) జూన్‌ 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడ చేరుతుంది. అక్కడ నుంచి 9.07 బయలుదేరి సాయంత్రం 5.54 గంటలకు కటక్‌ చేరుతుంది. కటక్‌ నుంచి 07166 నంబర్‌ గల రైలు జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.35 గంటలకు దువ్వాడ చేరుతుంది. రెండు నిమిషాల్లో మళ్లీ బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. ఇది నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, బరంపురం, ఖుర్దా రోడ్‌, భువనేశ్వర్‌లలో ఆగుతుంది.

Updated Date - 2023-05-30T03:51:47+05:30 IST