స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2023-08-22T00:57:28+05:30 IST

స్పందన అర్జీదారులపై ప్రత్యేక దృష్టి సారించి, ఆయా సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, జేసీ జాహ్నవి

అధికారులకు కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 21 : స్పందన అర్జీదారులపై ప్రత్యేక దృష్టి సారించి, ఆయా సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆయనతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ స్మరణ్‌రాజ్‌ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమం ముగిసేసరికి 266 మంది వినతులు అందజేసి, తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు బద లాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్జీల్లో పేర్కొన్న సమస్యలను త్వరగా పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. కాగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర ్వహించారు. ఎస్టీ విద్యార్థుల వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, హాస్టళ్లలో పూర్తిస్థాయిలో వర్కర్లను నియమించాలని, మెనూను సక్రమంగా అమలు చేయాలని, రక్షిత తాగునీటి ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శితోపాటుపాటు పలువురు విద్యార్థులు కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించారు.

Updated Date - 2023-08-22T00:57:28+05:30 IST