త్వరలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

ABN , First Publish Date - 2023-03-19T01:09:04+05:30 IST

: వైసీపీ మునిగిపోయే నావ లాంటిందని, భవిష్యత్తులో తమ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి పి.రాకేష్‌ రెడ్డి అన్నారు. శ

త్వరలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం
సమావేశంలో మాట్లాడుతున్న రాకేష్‌రెడ్డి

పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి రాకేష్‌రెడ్డి

మహారాణిపేట, మార్చి 18: వైసీపీ మునిగిపోయే నావ లాంటిందని, భవిష్యత్తులో తమ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి పి.రాకేష్‌ రెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు గొంపా గోవింద్‌ రాజు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాలను విశ్లేషిస్తే రానున్న రోజులలో వైసీపీ కనుమరుగవుతుందని అర్థమవుతుందని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా గ్యాస్‌ సిలిండర్‌ రూ.500కు అందించగలమన్నారు. ప్రతీ ఒక్కరు ఇంటింటికీ వెళ్లి, కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి, అధికారంలోకి వస్తే అందించబోయే సుపరిపాలనను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-03-19T01:09:04+05:30 IST