నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు

ABN , First Publish Date - 2023-03-19T01:28:49+05:30 IST

కొత్త అమావాస్య జాతర సందర్భంగా గౌరీ పంచాయతన దేవస్థానం కమిటీ శనివారం నూకాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు.

నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు
నూకాంబికకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న దృశ్యం

అనకాపల్లి టౌన్‌, మార్చి 18: కొత్త అమావాస్య జాతర సందర్భంగా గౌరీ పంచాయతన దేవస్థానం కమిటీ శనివారం నూకాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. కమిటీ ప్రతినిధులు, మహిళా మండలి సభ్యులు గవరపాలెంలోని ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి నూకాంబికకు సమర్పించారు. ఆలయ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌ వీరిని సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం ప్రతినిధులు బొడ్డేడ సన్యాసినాయుడు, బుద్ద రమణాజీ, కర్రి శివసూర్యనారాయణ, కర్రి సన్యాసినాయుడు, పి.సూరి అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:28:49+05:30 IST