తాజంగి పీహెచ్‌సీ డాక్టర్‌, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు

ABN , First Publish Date - 2023-05-26T01:14:16+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని హెచ్చరించారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన తొలుత తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్యాధికారి, దిగువస్థాయి ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో షోకాజు నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్‌, ప్రసవాలు, అంబులెన్సు సేవల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఫిజీషయన్‌తోపాటు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.

తాజంగి పీహెచ్‌సీ డాక్టర్‌, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు
తాజంగి పీహెచ్‌సీలో సిబ్బందితో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌

విధులకు గైర్హాజరైనందుకు ఐటీడీఏ పీవో చర్యలు

విధి నిర్వహణలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో అదనపు గదుల నిర్మాణానికి నిధులు

చింతపల్లి, మే 25: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని హెచ్చరించారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన తొలుత తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్యాధికారి, దిగువస్థాయి ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో షోకాజు నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్‌, ప్రసవాలు, అంబులెన్సు సేవల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఫిజీషయన్‌తోపాటు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులంతా ప్రభుత్వ ఆస్పత్రిల్లోనే పురుడు పోసుకునేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. ప్రస్తుతం వాతావరణంలో కలుగుతున్న మార్పుల కారణంగా పలు ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకు వస్తారని, అందువల్ల వైద్యులు అందుబాటులో వుండాలని స్పష్టం చేశారు. విధులకు గైర్హాజరైతే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.

ఏరియా ఆస్పత్రిలో అదనపు గదుల నిర్మాణానికి ప్రణాళిక

చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో అదనపు గదుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఏఈఈ జి.ప్రసన్న జ్యోతిని ఐటీడీఏ పీవో అభిషేక్‌ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. వార్డులు, గర్భిణుల నిరీక్షణ గదులు, ఎస్‌ఎన్‌సీయూను పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యసేవలు అందుతున్న తీరు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, వంద పడకల ఆస్పత్రి నూతన భవనం అందుబాటులోకి రావడానికి మరికొంతకాలం పడుతుందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ఓపీకి ప్రత్యేక గదులు లేకపోవడంతో వైద్యనిపుణులు ఒకేచోట కూర్చొని రోగులను పరీక్షిస్తున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఓపీ కోసం మూడు అదనపు గదులు, వార్డు కోసం ఒక హాల్‌ను ఐటీడీఏ నిధులతో నిర్మించనున్నామని చెప్పారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఏఈఈ ప్రతిపాదనలు పంపించిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో భూముల రీసర్వేపై తహసీల్దార్‌, సర్వేర్లు, వీఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. రీసర్వే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏరియా ఆస్పత్రి సూపరింటెడెంట్‌ జి.ఆదిత్య కీర్తి, సీనియర్‌ వైద్యాధికారి సుధాశారద, ఎంపీడీవో లాలం సీతయ్య, తహసీల్దార్‌ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌, టీఏ కృష్ణ, తదితరులు వున్నారు.

Updated Date - 2023-05-26T01:14:16+05:30 IST