అనారోగ్యంతో కన్నుమూసిన సీతమ్మ

ABN , First Publish Date - 2023-03-10T00:44:09+05:30 IST

హించిన సందర్భంగా కాకూరి సీతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌ డీఎస్పీ, జీకేవీధి సీఐ, సీలేరు ఎస్‌లు వెంటనే సీలేరు పీహెచ్‌సీ వైద్యాధికారిని వెంటబెట్టుకుని కొమ్ములవాడ గ్రామానికి వెళ్లి సీతమ్మకు వైద్య సేవలు అందించారు. ప్రతీ నెల ఆమెకు కావాల్సిన మందులను పంపిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే సీతమ్మ మృతిచెందడం దురదృష్టకరమని ఎస్‌ఐ అన్నారు.

అనారోగ్యంతో కన్నుమూసిన సీతమ్మ
మావోయిస్టు నేత కాకూరి పండన్నకు మాతృవియోగం

పాడె మోసి అంత్యక్రియల్లో పాలుపంచుకున్న సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ

సీలేరు, మార్చి 9: హించిన సందర్భంగా కాకూరి సీతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌ డీఎస్పీ, జీకేవీధి సీఐ, సీలేరు ఎస్‌లు వెంటనే సీలేరు పీహెచ్‌సీ వైద్యాధికారిని వెంటబెట్టుకుని కొమ్ములవాడ గ్రామానికి వెళ్లి సీతమ్మకు వైద్య సేవలు అందించారు. ప్రతీ నెల ఆమెకు కావాల్సిన మందులను పంపిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే సీతమ్మ మృతిచెందడం దురదృష్టకరమని ఎస్‌ఐ అన్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు గతంలోనే చనిపోయాడు. చిన్న కుమారుడు పండన్న చాలా ఏళ్ల నుంచి మావోయిస్టు ఉద్యమంలో వున్నాడు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా తనను చూడానికి రాలేదంటూ సీతమ్మ కొంతకాలం నుంచి బెంగ పెట్టుకున్నదని స్థానికులు తెలిపారు. కాగా సీతమ్మ అంత్యక్రియల కోసం ఎస్పీ సతీశ్‌కుమార్‌, చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్‌శివకిశోర్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ రామకృష్ణ రూ.10 వేలు మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.

Updated Date - 2023-03-10T00:44:09+05:30 IST