అంతటా సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2023-01-18T00:27:31+05:30 IST

మన్యంలో సంక్రాంతి సందడి కొనసాగుతున్నది. మైదాన ప్రాంతంలో సంక్రాంతి పండగ హడావిడి సోమవారం కనుమతో ముగిసిన సంగతి తెలిసిందే.

అంతటా సంక్రాంతి సందడి
జి.మాడుగుల సొలభం గ్రామంలో థింసా నృత్యం చేస్తున్న గ్రామస్థులు

21 వరకు మన్యంలో పలు ప్రాంతాల్లో పండగ

పాడేరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సంక్రాంతి సందడి కొనసాగుతున్నది. మైదాన ప్రాంతంలో సంక్రాంతి పండగ హడావిడి సోమవారం కనుమతో ముగిసిన సంగతి తెలిసిందే. కానీ మన్యంలో మాత్రం గిరిజనులు పుష్యమాసాంతం అంటే ఈ నెల 21వ తేదీ వరకు సంక్రాంతి పండగను నిర్వహించుకుంటారు. దీంతో అప్పటి వరకు రోజూ ఏదో ఒక ప్రాంతంలో సంక్రాంతి పండగ హడావిడి కనిపిస్తుంది. మంగళవారం మండలంలో గొండెలి పంచాయతీ లింగాపుట్టులో భారీజం పేరిట పండగను ఘనంగా నిర్వహించారు. అలాగే జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీలోనూ గిరిజనులు సంక్రాంతి పండగను వైభవంగా నిర్వహించారు. పండగలో భాగంగా గిరిజనులు వివిధ రకాల వేషధారణలతో అలరించారు. మహిళలు చేసిన సంప్రదాయ థింసా నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

Updated Date - 2023-01-18T00:27:34+05:30 IST