రోలుగుంట తహసీల్దార్‌పై విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2023-02-14T00:53:34+05:30 IST
రెవెన్యూ రికార్డులు మార్చేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న రోలుగుంట తహసీల్దార్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
నర్సీపట్నం, ఫిబ్రవరి 13: రెవెన్యూ రికార్డులు మార్చేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న రోలుగుంట తహసీల్దార్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి స్పందనలో ఆర్డీవో జయరాంకు ఫిర్యాదు చేశారు. రోలుగుంట మండలం చటర్జీపురం గ్రామానికి చెందిన గదబ ఆదివాసీల సాగులో ఉన్న భూమి రికార్డులను తహసీల్దార్ గత ఏడాది నవంబరులో మార్చేశారని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం కన్వీనర్ మోసూరి రాజు ఆరోపించారు. కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కమిటీ అధ్యక్షుడు నల్లి కళ్యాణం గిరిజనులు పాల్గొన్నారు.