మృత్యుకూపాలుగా రహదారులు
ABN , First Publish Date - 2023-11-20T00:10:37+05:30 IST
మృత్యుకూపాలుగా గోతులతో నిండిన రహదారులు మారాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజల పాలిట సీఎం జగన్ యముడిలా మారి రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని విమర్శించారు. రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేన నాయకులు స్థానిక గాజువాక జగ్గు జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
రహదారుల దుస్థితిపై జగ్గు జంక్షన్‌లో టీడీపీ-జనసేన నిరసన
గాజువాక, నవంబరు 19: మృత్యుకూపాలుగా గోతులతో నిండిన రహదారులు మారాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజల పాలిట సీఎం జగన్ యముడిలా మారి రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని విమర్శించారు. రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేన నాయకులు స్థానిక గాజువాక జగ్గు జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటున్న జగన్ ఒక్క రోడ్డయినా వేశావా అని ప్రశ్నించారు. గోతులతో నిండిన రోడ్ల మీదకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గాజువాక ప్రాంతంలోని రోడ్లను త్వరితగతిన అభివృద్ధి చేయని పక్షంలో జోనల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు మాట్లాడుతూ పరిపాలన రాజధాని పేరుతో విశాఖను విధ్వంసం చేశారన్నారు. అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, కక్షపూరితంగా వ్యవహరిస్తూ అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దల్లి గోవిందరెడ్డి, గంధం శ్రీనివాస్, నాయకులు తిప్పల రమణారెడ్డి, గడసాల అప్పారావు, ప్రసాదుల శ్రీనివాస్, నల్లూరు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.