నిర్బంధాలు ఉద్యమాలను ఆపలేవు
ABN , First Publish Date - 2023-08-22T00:08:20+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు, నాయకులపై నిర్బంధాలు పోరాటాలను ఆపలేవని మునిసిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఏసుదాసు ప్రకటనలో పేర్కొన్నారు.
ఎలమంచిలి, ఆగస్టు 21 : రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు, నాయకులపై నిర్బంధాలు పోరాటాలను ఆపలేవని మునిసిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఏసుదాసు ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీన విజయవాడలో జరగనున్న మునిసిపల్ కార్మికుల ధర్నాకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారన్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టేకన్నా కార్మికుల, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు అందరినీ పర్మినెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏసుదాసు డిమాండ్ చేశారు.