జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన పునరుద్ధరణ

ABN , First Publish Date - 2023-03-02T01:07:39+05:30 IST

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో బుధవారం విద్యుత్‌ ఉత్పాదన పునరుద్ధరించారు. ఇటీవల టీపీ డ్యాం, సొరంగ మార్గంలో చెట్లు, తుప్పలు తొలగిస్తున్న సమయంలో భారీ వృక్షం కొమ్మలు ట్రాస్‌రాక్స్‌(ఇనుప జాలీ)కి తగిలి అవి దెబ్బ తినడంతో విద్యుత్‌ ఉత్పాదనను ప్రాజెక్టు అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే.

జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన పునరుద్ధరణ
టీపీ డ్యాం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇనుపగేట్లు

ముంచంగిపుట్టు, మార్చి 1: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో బుధవారం విద్యుత్‌ ఉత్పాదన పునరుద్ధరించారు. ఇటీవల టీపీ డ్యాం, సొరంగ మార్గంలో చెట్లు, తుప్పలు తొలగిస్తున్న సమయంలో భారీ వృక్షం కొమ్మలు ట్రాస్‌రాక్స్‌(ఇనుప జాలీ)కి తగిలి అవి దెబ్బ తినడంతో విద్యుత్‌ ఉత్పాదనను ప్రాజెక్టు అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల అనంతరం 1, 2 నంబర్లు గల జనరేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. వాటితో ప్రస్తుతం 34 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతోంది. రాత్రికి మరో రెండు జనరేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ప్రాజెక్టు ఎస్‌ఈ నాగేశ్వరరావు తెలిపారు. అలాగే టీపీ (టర్నల్‌ పాయింట్‌)డ్యాం వద్ద తుప్పలు, చెట్లు తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్నాయని, దెబ్బతిన్న ఇనుప గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-03-02T01:07:39+05:30 IST