నగరంలో వర్షం

ABN , First Publish Date - 2023-05-26T01:43:47+05:30 IST

తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం కల్పించేలా గురువారం సాయంత్రం మంచి వర్షం కురిసింది.

నగరంలో వర్షం

చల్లబడిన వాతావరణం

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం కల్పించేలా గురువారం సాయంత్రం మంచి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఎక్కువగానే ఉన్నా...సాయంత్రం మూడున్నర నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. అనేక ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఆ సమయంలో తీవ్రమైన గాలులు వీచాయి. ఎండ తీవ్రతకు భూమి వేడెక్కడంతోపాటు పశ్చిమ దిశ నుంచి వీస్తున్న పొడి గాలులు, సముద్రం మీదుగా తేమ గాలుల కలయికతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఈదురుగాలులతో వర్షం కురిసినట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే, రాత్రి 7.30 గంటల సమయంలో మరోసారి నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది.

Updated Date - 2023-05-26T01:43:47+05:30 IST