పంచాయతీ నిధుల దుర్వినియోగంపై నిరసన
ABN , First Publish Date - 2023-08-02T00:47:30+05:30 IST
కేంద్రం కేటాయించిన పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగంపై ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు బీజేపీ జిల్లా ఇన్‌చార్జి వై. మాలకొండయ్య స్పష్టం చేశారు.
పరవాడ, ఆగస్టు 1: కేంద్రం కేటాయించిన పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగంపై ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు బీజేపీ జిల్లా ఇన్‌చార్జి వై. మాలకొండయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందన్నారు. ఈనెల 10న జిల్లా కేంద్రాల్లో చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు, నాయకులు ఈర్ల శ్రీరామ్మూర్తి, పీవీ.రవిరాజు, డీవీఎస్. వర్మ, సదరం నాగేశ్వరరావు, పట్టాభి ప్రసాద్, గండి నమోబాబు, తదితరులు పాల్గొన్నారు.