ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు

ABN , First Publish Date - 2023-06-21T00:40:49+05:30 IST

పది, ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 1, 2 ర్యాంకులను సాధించిన తానాం ప్రభుత్వ గరుకుల పాఠశాల ఇద్దరి విద్యార్థినులకు జగనన్న ఆణిముత్యాల పథకం కింద రూ.లక్ష, రూ.75 వేలు చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు
భాగ్యశ్రీకి చెక్కు, ప్రశంసా పత్రం అందజేస్తున్న సీఎం జగన్‌

పరవాడ, జూన్‌ 20: పది, ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 1, 2 ర్యాంకులను సాధించిన తానాం ప్రభుత్వ గరుకుల పాఠశాల ఇద్దరి విద్యార్థినులకు జగనన్న ఆణిముత్యాల పథకం కింద రూ.లక్ష, రూ.75 వేలు చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద గల ఏ కన్వర్షన్‌ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇంటర్‌ విద్యార్థిని భాగ్యశ్రీ (స్టేట్‌ ఫస్ట్‌,) పదో తరగతి విద్యార్థిని రొంగల నిరీక్షత ( స్టేట్‌ రెండో ర్యాంక్‌)లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా చెక్కు, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్‌ మీసాల అప్పలనాయుడుకు షీల్డ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-21T00:40:49+05:30 IST