పీఆర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-01-07T01:08:22+05:30 IST

మండలంలోని తారువ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ 2023 డైరీని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు శుక్రవారం ఆవిష్కరించారు.

పీఆర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణ
పీఆర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ డైరీని ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

దేవరాపల్లి, జనవరి 6: మండలంలోని తారువ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ 2023 డైరీని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. సంఘ అధ్యక్షుడు మురళీ కృష్ణంనాయుడు, ప్రధాన కార్యదర్శి కె.సంగీతరావు, తదితర సంఘ నాయకులు ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకం కలిసి, నూతన, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం డైరీని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి ఆర్‌.శ్రీనివాసరావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T01:08:23+05:30 IST