భవనం పైనుంచి జారిపడి పెయింటర్ మృతి
ABN , First Publish Date - 2023-03-19T00:43:29+05:30 IST
సింహాచలం సమీపంలోని శ్రీనివాసనగర్‌లో భవనం పైనుంచి ప్రమాదవ శాత్తు కాలుజారి పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..

సింహాచలం, మార్చి 18 : సింహాచలం సమీపంలోని శ్రీనివాసనగర్‌లో భవనం పైనుంచి ప్రమాదవ శాత్తు కాలుజారి పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రామాటాకీస్ సమీపంలోని అమర్‌నగర్‌లో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన ఎం. భాస్కర్ (43) రెండు దశాబ్దాలుగా పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సింహాచలంలోని శ్రీనివాసనగర్‌లో ఒక ఇంటి మూడువ అంతస్తు పైనుంచి తాడు వేలాడదీసుకుని పెయింటింగ్ వేయిస్తుండగా అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో తలకు బలమైన గాయమైంది. వెం టనే అతన్ని తోటి కూలీలు, స్థానికులు ఆటోలో స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పెందుర్తి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.