పాడేరు జేసీ బదిలీ
ABN , Publish Date - Dec 20 , 2023 | 12:46 AM
స్థానిక జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసుతో పాటు జిల్లాలో రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం బన్సాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. మంగళవారం రాత్రి రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా జె.శివశ్రీనివాసు నియామకం
స్థానిక జేసీగా కేబీ కార్తీక్
పాడేరు, రంపచోడవరం సబ్‌కలెక్టర్లుగా థాత్రిరెడ్డి, ఎస్.ప్రశాంత్‌కుమార్‌లకు పోస్టింగ్
పాడేరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసుతో పాటు జిల్లాలో రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం బన్సాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. మంగళవారం రాత్రి రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసును రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బదిలీ చేసి, ఆయన స్థానంలో పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా పని చేస్తున్న కేబీ కార్తీక్‌ను నియమించారు. జిల్లాలో రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా వున్న శుభం బన్సాల్‌ను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. అలాగే ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న పి.ఽథాత్రిరెడ్డిని స్థానిక సబ్‌కలెక్టర్‌గా, ఎస్.ప్రశాంత్‌కుమార్‌ను రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా నియమించారు. స్థానిక సబ్‌కలెక్టర్‌గా నియమితులైన థాత్రిరెడ్డి చింతపల్లి ఏఎస్‌పీ ప్రతాప్ శివకిశోర్ సతీమతి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉన్న స్థానిక సబ్‌కలెక్టర్ పోస్టు ఎట్టకేలకు తాజా ఐఏఎస్‌ల నియామకాలతో భర్తీ అయింది.