సమయం లేదు.. పనులు త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2023-03-26T00:18:43+05:30 IST

జీ-20 సదస్సుల నేపథ్యంలో నగర సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు.

సమయం లేదు.. పనులు త్వరగా పూర్తి చేయండి

విశాలాక్షినగర్‌, మార్చి 25 : జీ-20 సదస్సుల నేపథ్యంలో నగర సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బీచ్‌ రోడ్డులో జరుగుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్‌ పి. రాజాబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ సమయం లేనందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీతకొండ వ్యూ పాయింట్‌కు డాక్టర్‌ వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌ సీతకొండ పేరు పెట్టడానికి ప్రతిపాదనలు చేశామని మేయర్‌, మంత్రి అమర్‌నాఽథ్‌ కల్పించుకుని కొన్నేళ్లుగా సీతకొండ అంటేనే స్థానికులకు బాగా తెలుసునని అన్నారు. దీంతో మంత్రులు వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌ (సీతకొండ)గా నామకరణం చేయాలని సూచించారు. అక్కడ ఐ లవ్‌ వైజాగ్‌ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు వద్ద అధికారులతో కలిసి మంత్రి గుడివాడ సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ స్వాతిదాస్‌క పలు విభాగాల అఽధికారులు తదితరులు పాల్గొన్నారు.

ముడసర్లోవ సోలార్‌ ప్లాంట్‌ సందర్శన

ఆరిలోవ : ముడసర్లోవ రిజర్వాయరులో ఏర్పాటు చేసిన ప్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం సందర్శించారు. జీ - 20 సదస్సుకు వచ్చే ప్రతినిధులు ప్లాంట్‌ను సందర్శించే అవకాశం ఉండడంతో పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. ఆయనతో పాటు మేయర్‌ గొలగాని హరి వెంకటరుమారి, కమిషనర్‌ రాజాబాబు, డెప్యూటీ మేయర్‌ శ్రీధర్‌ ఉన్నారు.

Updated Date - 2023-03-26T00:18:43+05:30 IST