నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2023-03-26T01:19:04+05:30 IST

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పక్కన డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీవాత్సవ

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

- పీహెచ్‌సీ వైద్యులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ హెచ్చరిక

పాడేరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఏజెన్సీలోని 35 పీహెచ్‌సీల వైద్యాధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలో అందుతున్న వైద్య సేవలు, ఇతర అంశాలను ఆన్‌లైన్‌లో విధిగా నమోదు చేయాలన్నారు. పీహెచ్‌సీల వైద్యులు ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీలు చేయాలని, షెడ్యూల్‌ ప్రకారం వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను చేపట్టాలని, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, వారికి ఆరోగ్య పరీక్షలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో హైరిస్క్‌ గర్భిణుల ప్రసవాలపై తగిన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. గర్భిణుల వివరాలను జననీ సురక్ష యోజన పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రోత్సాహక పారితోషికం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇకపై ప్రతి రెండు వారాలకు పీహెచ్‌సీల వైద్యాధికారులతో సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి ఆలస్యంగా హాజరైన ఆర్‌వీ నగర్‌, సుంకరమెట్ట, భీమవరం పీహెచ్‌సీ వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అశుతోశ్‌శ్రీవాత్సవ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, డీటీసీవో డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:20:26+05:30 IST