వీఆర్‌కు నాతవరం ఎస్‌ఐ
ABN , First Publish Date - 2023-07-24T01:19:01+05:30 IST
నాతవరం పోలీస్టేషన్‌లో శనివారం రాత్రి కలగాని గంగరాజు అలియాస్ నాని అనే యువకుడిని పోలీసులు కొట్టిన ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును వీఆర్‌కు బదిలీ చేసినట్టు నర్సీపట్నం ఏఎస్పీ ఆదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. ఆయన ఆదివారం నర్సీపట్నం రూరల్ సీఐ రమణయ్యతో కలసి నాతవరం పోలీస్టేషన్‌ను సందర్శించారు. యువకుడిని పోలీసులు కొట్టిన సంఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించారు.
మరో ముగ్గురు కానిస్టేబుళ్లు, హోంగార్డు కూడా...
యువకుడిని పోలీస్ స్టేషన్‌లో కొట్టిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్
విచారణ జరిపిన నర్సీపట్నం ఏఎస్పీ
ఘటనపై జిల్లా ఎస్పీకి నివేదిక ఇస్తానని వెల్లడి
నాతవరం, జూలై 23: నాతవరం పోలీస్టేషన్‌లో శనివారం రాత్రి కలగాని గంగరాజు అలియాస్ నాని అనే యువకుడిని పోలీసులు కొట్టిన ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును వీఆర్‌కు బదిలీ చేసినట్టు నర్సీపట్నం ఏఎస్పీ ఆదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. ఆయన ఆదివారం నర్సీపట్నం రూరల్ సీఐ రమణయ్యతో కలసి నాతవరం పోలీస్టేషన్‌ను సందర్శించారు. యువకుడిని పోలీసులు కొట్టిన సంఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న కలగాని గంగరాజు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. మహిళపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మేరకు నాగరాజుపై వివిధ సెక్షన్ల కింద స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. అయితే విధి నిర్వహణలో అలసత్వం వహించారన్న అభియోగాలపై ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు నవీన్, కుమార్, మల్లేశ్, హోంగార్డు వరహాలును వీఆర్‌కు బదిలీ చేశామని తెలిపారు. గొలుగొండ ఎస్‌ఐ నారాయణరావుకు నాతవరం ఎస్‌ఐగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్టు ఏఎస్పీ చెప్పారు. కలగాని గంగరాజును పోలీస్టేషన్‌లో కొట్టిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి జిల్లా ఎస్పీకి నివేదిక అందించనున్నట్టు తెలిపారు.