ఎలమంచిలిలో త్వరలో రోడ్డు విస్తరణ

ABN , First Publish Date - 2023-03-19T00:17:53+05:30 IST

ఎలమంచిలి పట్టణంలో త్వరలో రోడ్ల విస్తరణ ఉంటుందని, ఇందుకు వ్యాపారులు సహకరించాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి అన్నారు.

ఎలమంచిలిలో త్వరలో రోడ్డు విస్తరణ
వ్యాపారస్తుల సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ రమాకుమారి

ఎలమంచిలి, మార్చి 18: ఎలమంచిలి పట్టణంలో త్వరలో రోడ్ల విస్తరణ ఉంటుందని, ఇందుకు వ్యాపారులు సహకరించాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి అన్నారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో వ్యాపారులతో నిర్వహించిన సమా వేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాన డ్రైనేజీలో పూడికతీత పనులు చేపట్టారని, ఈ కారణంగా వ్యాపారులకు కాస్త ఇబ్బందులు తప్పవన్నారు. పారిశుధ్య కార్మికులకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీలపై మేన్‌హోల్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రైనేజీలపై తాత్కాలిక పనులు మాత్రమే చేయించుకోవాలని, శాశ్వత పనులు చేపట్టవద్దని, త్వరలో రోడ్ల విస్తరణ ఉంటుందన్నారు. వ్యాపారులంతా సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ క్రష్ణవేణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పల్లా శ్రీనివాసరావు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌లు బెజవాడ నాగేశ్వరరావు, అర్రెపు గుప్తాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:17:53+05:30 IST