ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ సరిగా పనిచేయడంలేదు
ABN , First Publish Date - 2023-08-03T01:22:39+05:30 IST
ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబురాజు)కు ఆ ఇద్దరు మహిళా అధికారులపై కోపం వచ్చింది. వీళ్లను ఇక్కడి నుంచి బదిలీ చేసేయండంటూ డీపీవోకు ఫోన్ చేసి హుకుం జారీచేశారు. వివరాల్లోకి వెళితే... వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద ‘టేక్ హోమ్ రేషన్’ కిట్లు పంపిణీని ప్రారంభించడానికి ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు బుధవారం అచ్యుతాపురం వచ్చారు.
‘ఎలమంచిలి’ నుంచి పంపేయండి
డీపీవోకు ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆదేశం
అచ్యుతాపురం, ఆగస్టు 2: ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబురాజు)కు ఆ ఇద్దరు మహిళా అధికారులపై కోపం వచ్చింది. వీళ్లను ఇక్కడి నుంచి బదిలీ చేసేయండంటూ డీపీవోకు ఫోన్ చేసి హుకుం జారీచేశారు. వివరాల్లోకి వెళితే... వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద ‘టేక్ హోమ్ రేషన్’ కిట్లు పంపిణీని ప్రారంభించడానికి ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు బుధవారం అచ్యుతాపురం వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తరువాత ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈఓపీఆర్‌డీ రాఽధికలతో సమావేశమై సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల పనితీరుపై సమీక్ష జరిపారు. ఎమ్మెల్యే అడిగిన పలు ప్రశ్నలకు వారు సరైనా సమాధానాలు చెప్పలేదు. దీంతో డీపీఓ శిరీషారాణికి ఫోన్ చేశారు. ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ సక్రమంగా విధులు నిర్వహించడంలేదని, గ్రామాల్లో సమస్యలను పట్టించుకోవడంలేదని, వలంటీర్లపై పర్యవేక్షణ కొరవడిందని, అందువల్ల ఇద్దరినీ వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఆదేశించారు.