పాడి రైతు ఆర్థికాభివృద్ధే హెరిటేజ్ ధ్యేయం
ABN , First Publish Date - 2023-02-25T00:57:20+05:30 IST
పాడి రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయమని హెరిటేజ్ మేనేజర్ కూండ్రపు శేషు అన్నారు.
అచ్యుతాపురం, ఫిబ్రవరి 24: పాడి రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయమని హెరిటేజ్ మేనేజర్ కూండ్రపు శేషు అన్నారు. ఎంజేపురంలో ఆవు చనిపోయిన పాడిరైతుకు రూ.30 వేలు బీమా చెక్కుని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులతోపాటు వాటిని పెంచే పాడిరైతులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీముని నాగేశ్వరరావు, పి.అప్పారావు, నూకరాజు, బుల్లిబాబు, నంద తదితరులు పాల్గొన్నారు.