ఘనంగా కార్మిక దినోత్సవం
ABN , First Publish Date - 2023-05-02T01:02:44+05:30 IST
జిల్లాలో కార్మిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నా పరిశ్రమలు, ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు.
అనకాపల్లిటౌన్, మే 1: జిల్లాలో కార్మిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నా పరిశ్రమలు, ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. అనకాపల్లి పట్టణంలోని సీఐటీయూ కార్యాలయం వద్ద కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ అరుణ పతాకాన్ని ఎగురవేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుత్తల శంకరరావు ఆధ్వర్యంలో ఏపీ బేవరేజస్ వద్ద కె.కొండలరావు, బైపాస్‌రోడ్డులో ముఠా కార్మికుల ఆధ్వర్యంలో మంద రాము, బాటా సెంటర్ వద్ద భీశెట్టి అప్పారావు, జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద బొమ్మల రాము, వ్యవసాయ పరిశోధనా కేంద్రం వద్ద కొణతాల నందీశ్వరరావు, ఆర్టీసీ డిపో వద్ద పరమేశ్వరరావు అరుణ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో లంకా అప్పారావు, సురేష్, లక్ష్మణ్, సత్యనారాయణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు.