మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-04-03T00:43:02+05:30 IST
స్థానిక తోటగరువు సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన ఓ వివాహిత ఆదివారం సాయంత్రం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆరిలోవ సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆరిలోవ, ఏప్రిల్ 2: స్థానిక తోటగరువు సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన ఓ వివాహిత ఆదివారం సాయంత్రం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆరిలోవ సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాంధీనగర్‌కు చెందిన వాసుపల్లి వరలక్ష్మి (47) దుస్తుల వ్యాపారం చేసేది. అయితే తనవద్ద దుస్తులను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసినవారు నగదు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురై అనారోగ్యం పాలైంది. దీంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం సాయంత్రం కొళాయిలు రావడంతో పక్కింటి వారు తలుపు కొట్టి చూడగా వరలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వారు వరలక్ష్మి భర్త వాసుపల్లి ఉమాపతికి సమాచారం అందించారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వాసుపల్లి ఉమాపతి డాక్‌యార్డు విశ్రాంతి ఉద్యోగి. వీరికి సంతానం లేదు.