మునిసిపల్‌ కార్మికుల మానవహారం

ABN , First Publish Date - 2023-09-27T01:13:16+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎలమంచిలి ప్రధాన రోడ్డుపై మునిసిపల్‌ కార్మికులు మానవహారం నిర్వహించారు.

మునిసిపల్‌ కార్మికుల మానవహారం
ఎలమంచిలిలో మానవహారం చేస్తున్న కార్మికులు

ఎలమంచిలి, సెప్టెంబరు 26 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎలమంచిలి ప్రధాన రోడ్డుపై మునిసిపల్‌ కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఏసుదాసు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర సంఘం ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ వివిధ దశల్లో కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కరించాలని మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశామన్నారు. ఈ నిరసనలో సంఘం నేతలు వై.నూకరాజు, సీహెచ్‌. వెంకటరమణ, మహేష్‌, ఈ. చంద్రరావు, వెంకటరమణ, నాగరాజు, నరసింహామూర్తి, ఆదిమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-27T01:13:16+05:30 IST