మది నిండా.. తెలుగు జెండా
ABN , First Publish Date - 2023-03-19T00:39:12+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘనమైన విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ జెండాలు పట్టు కుని బాణసంచా కాల్చుతూ, డప్పులు వాగిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు.

భీమునిపట్నం, మార్చి 18 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘనమైన విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ జెండాలు పట్టు కుని బాణసంచా కాల్చుతూ, డప్పులు వాగిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. భీమిలిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం చిన్నబజారు పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పట్టభద్రులు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కష్టించి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో 2024 ఎన్నికల్లో కూడా శ్రమించాలని పిలుపునిచ్చారు. తొలుత చిన్నబజారు జంక్షన్‌లో వున్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గంటా నూకరాజు, పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు డీఏఎన్ రాజు, తెలుగు మహిళా నాయకులు కె. లీలావతి, నాయకులు దామోదరరావు, పిట్టా సూరిబాబు, పాసి నరసింగరావు, యరబాల అనిల్ ప్రసాద్, బోయి శ్రీను, పాల్గొన్నారు.