జలపాతాల సౌందర్యం చూతము రారండి

ABN , First Publish Date - 2023-07-13T00:40:26+05:30 IST

ఎత్తైన పచ్చని గిరుల మధ్య నుంచి పాలనురగలా ప్రవహిస్తున్న రెండు జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మండలంలో బూసిపుట్టు పంచాయతీ సంతవీధి, దోనిపుట్టు గ్రామాల సమీపంలో ఎగువ నెమలి, దిగువ నెమలిగా స్థానికులు పిలిచే ఈ జలపాతాలు పర్యాటకులకు కొత్తగా పరిచయమయ్యాయి.

జలపాతాల సౌందర్యం చూతము రారండి
ఎత్తైన గిరులపై నుంచి ప్రవహిస్తున్న ఎగువ నెమలి జలపాతం

పర్యాటకులకు కనువిందు చేస్తున్న ఎగువ నెమలి, దిగువ నెమలి జలపాతాలు

ముంచంగిపుట్టు, జూలై 12: ఎత్తైన పచ్చని గిరుల మధ్య నుంచి పాలనురగలా ప్రవహిస్తున్న రెండు జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మండలంలో బూసిపుట్టు పంచాయతీ సంతవీధి, దోనిపుట్టు గ్రామాల సమీపంలో ఎగువ నెమలి, దిగువ నెమలిగా స్థానికులు పిలిచే ఈ జలపాతాలు పర్యాటకులకు కొత్తగా పరిచయమయ్యాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉరకలేస్తూ ప్రవహిస్తున్నాయి. సంతవీధి నుంచి దోనిపుట్టు గ్రామ సమీపంలో ఎత్తైన గిరులపై నుంచి రెండు జలపాతాలు పక్కపక్కనే ఒకదానికి ఒకటి పోటీ పడుతూ ప్రవహిస్తున్నాయి. గతంలో ఈ జలపాతాల వద్దకు నెమళ్లు వచ్చి నాట్యం చేసేవని, అందుకే వీటిని నెమలి జలపాతాలుగా పిలుస్తామని స్థానికులు చెబుతున్నారు. ఈ జలపాతాలను చూడాలంటే ముంచంగిపుట్టు నుంచి సుమారు 17 కిలోమీటర్లు ప్రయాణించాలి.

Updated Date - 2023-07-13T00:40:26+05:30 IST