భక్తిశ్రద్ధలతో లక్ష్మీగణపతి హోమం
ABN , First Publish Date - 2023-09-03T23:50:17+05:30 IST
పట్టణంలోని స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో ఆదివారం నిజశ్రావణ బహుళ శుద్ధ సంకష్టహర చతుర్ధి సందర్భంగా సామూహిక లక్ష్మీగణపతి హోమాన్ని నిర్వహించారు.
చోడవరం, సెప్టెంబరు 3 : పట్టణంలోని స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో ఆదివారం నిజశ్రావణ బహుళ శుద్ధ సంకష్టహర చతుర్ధి సందర్భంగా సామూహిక లక్ష్మీగణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. అర్చకులు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రావికమతం : సంకష్టహర చతుర్ధి పర్వదినం సందర్భంగా టి.అర్జాపురంలోని బాలవరసిద్ధి వినాయక ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గుంటూరు లక్ష్మణశర్మ, రామారావుల ఆధ్వర్యంలో తొలుత స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి, లక్ష్మీగణపతి హోమాన్ని జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.