పెదపల్లిలో గణపతికి లక్ష గరిక పూజ

ABN , First Publish Date - 2023-09-26T00:50:47+05:30 IST

మునిసిపాలిటీలోని పెదపల్లిలో సోమవారం గణపతికి లక్ష గరిక పూజను నిర్వహించారు.

పెదపల్లిలో గణపతికి లక్ష గరిక పూజ
వినాయకుడికి లక్ష గరిక పూజలో పాల్గొన్న భక్తులు

ఎలమంచిలి, సెప్టెంబరు 25: మునిసిపాలిటీలోని పెదపల్లిలో సోమవారం గణపతికి లక్ష గరిక పూజను నిర్వహించారు. వేదపండితులు సోమేష్‌శర్మ, సునీల్‌ శర్మ, కృష్ణ గురుస్వామిల పర్యవేక్షణలో ఈ పూజను చేశారు. భక్తులకు జయగణేశ కమిటీ ప్రతినిధులు దాసరి గణేష్‌, బొద్దపు కృష్ణ, పందల సూరిబాబు, శేషు, నానాజీలు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-09-26T00:50:47+05:30 IST