ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు నిధుల కొరత

ABN , First Publish Date - 2023-09-07T01:24:47+05:30 IST

ప్రభుత్వ మానసిక వైద్యశాల అప్‌గ్రేడేషన్‌కు నిధుల కొరత అడ్డంకిగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ పరికరాలు కొనుగోలు చేయకపోవడంతో సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పనులు ప్రారం భించి తొమ్మిదేళ్లవుతున్నా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ఆస్పత్రి మార్పు కార్యరూపం దాల్చలేదు.

ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు నిధుల కొరత

ప్రభుత్వ మానసిక వైద్యశాలను తొమ్మిదేళ్ల క్రితం

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక చేసిన కేంద్రం

రూ.29.76 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు

60ః40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా

రూ.19.8 కోట్లతో భవనాల నిర్మాణం పూర్తి

పరికరాలు కొనుగోలుకు నిధులు సమస్య

అందుబాటులోకి రాని నూతన భవనాలు, సేవలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ మానసిక వైద్యశాల అప్‌గ్రేడేషన్‌కు నిధుల కొరత అడ్డంకిగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ పరికరాలు కొనుగోలు చేయకపోవడంతో సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పనులు ప్రారం భించి తొమ్మిదేళ్లవుతున్నా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ఆస్పత్రి మార్పు కార్యరూపం దాల్చలేదు.

దేశంలో మానసిక వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పలు ఆస్పత్రులను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్స్‌లుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. ఆ జాబితాలో విశాఖలోని మానసిక ఆస్పత్రి కూడా ఉంది. ఈ మేరకు 2015లోనే ఉత్తర్వులు విడుదల య్యాయి. ఇందులో భాగంగా రూ.29.7 కోట్లతో ఆస్పత్రిలో భవన నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పన చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో నిధులు వెచ్చించాలి. ఇందులో రూ.19.8 కోట్లు భవన నిర్మాణాలకు, రూ.9.9 కోట్లు పరికరాలు, ఇతర అవస రాలకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే, భవన నిర్మా ణాలు పూర్తయి సుమారు ఏడాది కావస్తోంది. కానీ పరికరాల కొనుగోలుకు అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ భవనాలు, సేవలు అందుబాటులోకి రాని పరిస్థితి ఏర్పడింది. పరికరాలు కొనుగోలు చేస్తే ఈ భవనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, తద్వారా రోగులకు వేగంగా సేవలు అందించేందుకు అవకాశ ముంటుందని అధికారులు చెబుతున్నారు.

కొత్త కోర్సులు అందుబాటులోకి..

ఆస్పత్రి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా అప్‌గ్రేడ్‌ అయితే క్లినికల్‌ సైకాలజిస్ట్‌, సైకియాట్రీ సోషల్‌ వర్కర్‌, సైకియాట్రీ నర్శింగ్‌ కోర్సులు రానున్నాయి. క్లినికల్‌ సైకాలజీ, సైకియాట్రీ సోషల్‌ వర్కర్‌ కోర్సులు రెండేళ్లు, సైకియాట్రీ నర్సింగ్‌ కోర్సు ఏడాది పాటు నిర్వహిస్తారు. క్లినికల్‌ సైకాలజీ, సైకియాట్రీ సోషల్‌ వర్కర్‌ కోర్సుల్లో 15 మందికి, సైకియాట్రీ నర్సింగ్‌ కోర్సులో 40 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. రెండేళ్లు శిక్షణ అనంతరం మిగిలిన హాస్పిటల్స్‌, సైకియాట్రీ సెంటర్లలో వీరి సేవలను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ సెంటర్లు ద్వారా రానున్న కాలంలో మానసిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

మౌలిక వసతుల కల్పన..

ప్రస్తుతం ఆస్పత్రిలో నిర్మించిన భవనాలను అడ్మినిస్ర్టేషన్‌, డిపార్టుమెంట్లు, హాస్టళ్లు, స్టాఫ్‌ క్వార్టర్స్‌, రీహాబిలిటేషన్‌ సెంటర్‌, చైల్డ్‌ సైకియాట్రీ, డీ అడిక్షన్‌ వార్డులకు కేటాయించ నున్నారు. ఈ విభాగాలు అందుబాటులోకి వస్తే మరో 120 మంది వరకు సిబ్బంది రానున్నారు. దీనివల్ల సేవలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా అదనంగా 80 పడకలు అందుబాటులోకి వస్తాయి.

Updated Date - 2023-09-07T01:24:47+05:30 IST